Majors have to update Aadhaar Biometric once every ten years
mictv telugu

ఆధార్ కార్డుపై కీలక నిర్ణయం.. మేజర్లు పదేళ్లకోసారి ఇలా చేయాలి

September 17, 2022

Majors have to update Aadhaar Biometric once every ten years

దేశంలో ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ నెంబరు చాలా సేవలకు తప్పనిసరి అవసరంగా ఉంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ సేవలు పొందాలంటే ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి. వీటిని జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరో కీలక నిర్ణయం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆధార్ కార్డుల విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆ సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

ఇక నుంచి ప్రతీ పదేళ్లకోసారి వయోజనులు అంటే 18 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలనే నిబంధన రానున్నట్టు తెలిపారు. ఈ పనిని స్వచ్ఛందంగా చేయాలని స్పష్టం చేశారు. అంటే ఆధార్ కార్డు ఉన్నవారు ప్రతీ పదేళ్లకు ఒకసారి తమ వేలిముద్రలు, ఫేషియల్, ఐరిష్‌లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 70 ఏళ్లు పైబడిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ నిబంధన వర్తించదని, వారికి మినహాయింపు ఉంటుందని సదరు అధికారి వెల్లడించారు. కాగా, దేశంలో ఆధార్ తీసుకున్న వారి శాతం 93.50 కి చేరింది. దేశ వ్యాప్తంగా 50 వేల ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఉన్నాయి. గత ఆగస్టు నెలలో కొత్తగా 24.20 లక్షల మంది ఆధార్ కార్డు కోసం ఎన్‌రోల్‌మెంట్ చేయించుకున్నారు.