Makajgiri girl case rpf asi lallu Sebastian gets life sentence jail
mictv telugu

మల్కాజ్‌గిరి బాలికపై రేప్ కేసులో ఏఎస్ఐకి జీవిత ఖైదు

September 16, 2022

అశుభశుభం ఎరుగని బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కామాంధుడి పాపం పండింది. 2019లో హైదరాబాద్ మల్కాజ్ గిరిలో బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఆర్పీఎఫ్ ఏఎస్ఐ లల్లూ సెబాస్టియన్‌కు స్థానిక పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. సెబాస్టిన్ ఓ బాలికను ఆమె ఇంట్లోనే ఎవరూ లేనప్పుడు బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులకు ఆరా తీయగా విషయం తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. మల్కాజిగిరి ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి స్పెషల్‌ పోక్సో కోర్టు కేసును విచారించి జీవిత ఖైదుతోపాటు రూ. 15వేల జరిమానా కూడా విధించారు.