ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది కరోనా వైరస్. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది? లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశపు ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా నాలుగోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కల్పించిన లాక్‌డౌన్ సడలింపుల్లో ప్రజలు తప్పకుండా కొన్ని పనులు చేయాలని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు.
తన ట్విటర్ అకౌంట్‌లో మాస్క్ ధరించిన ఫోటోను పంచుకుంటూ, కొన్ని సూచనలు చేశారు మహేష్. ‘మనం నెమ్మదిగా బయటకు వస్తున్నాం. ఖచ్చితంగా వస్తాం. ఇలాంటి సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. మీరు బయటకు బయలుదేరిన ప్రతిసారీ మాస్క్ ధరించడం ఒక అలవాటుగా చేసుకోండి. అది కనీసం మనలను, ఇతరులను రక్షించడానికి చేయగలిగిన పని’ అని మహేష్ సూచించారు.