దోమను దేవుణ్ని చేసి.. హారతులు పట్టి ! - MicTv.in - Telugu News
mictv telugu

దోమను దేవుణ్ని చేసి.. హారతులు పట్టి !

August 9, 2017

ఇంత వరకు మనం వానలు సరిగ్గా పడకపోతే కప్పల పెళ్ళి చేయడం చూసాం. కానీ దోమ దేవుడికి పూజలు చేయడం చూసామా.. లేదు కదూ ? ఇదిగో అలాంటి ఈ వింత న్యూస్ మీకోసమే. జార్ఖండ్ రాష్ట్రంలో కొందరు జనాలు దోమ దేవుడికి పూజలు చేస్తున్నారు. దోమలకు పూజలా ? ఎందుకూ అని అంటారా ? అయితే ఆలకించండి.. జార్ఖండ్ లో ఈ మధ్య మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు చాలా ఎక్కువయ్యాయట. ఇప్పటికే చాలా మంది ఈ విష జ్వరాల బారినపడి చనిపోయారట. దీనికంతటికి కారణం దోమ కాటే కదా అని నమ్మారు జనాలు.

వెంటనే దోమ ప్రతిమతో పాదయత్ర చేస్తూ గుడికి బయలు దేరారు. బాజాప్త పంతులు మంత్రాలు చదువుతుంటే కొందరు దోమ దేవుడు ఒంట్లో పూనినట్టే శివాలు ఊగిపోయారట. జార్ఖండ్ లో ఇంతగా విష జ్వరాలు పూనుతుంటే ప్రభుత్వం కినుకు వహించడం అక్కడి జనాలను నారాజ్ చేసినట్టుంది. అందుకే వాళ్ళిలా ప్రభుత్వాలను వేడుకుంటే పనవ్వదు రోగాలను ప్రసాదిస్తున్న దోమలను వేడుకుందామని ఈ పని చేసారు వాళ్ళు. దోమను దేవుణ్ని చేసి వేడుకుంటేనైనా ఆ దేవుడు తన దోమ దండుకు మనుషుల్ని కుట్టి రోగాల పాలు చెయ్యకండని ఆజ్ఞాపించవచ్చని, వాళ్ళు నమ్మి ఈ పని చేసినట్టున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వాలెప్పుడూ జనాలను మేలుకొలపవు – జనాలే ప్రభుత్వాలను మేలుకొలపాలనే నీతి మహ బాగా తెలుస్తోంది కదూ !