Make these small changes in your diet to avoid heart disease..!!
mictv telugu

గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే ఆహారంలో ఈ చిన్న మార్పులు చేసుకోండి..!!

January 10, 2023

Make these small changes in your diet to avoid heart disease..!!

నేటికాలంలో వయస్సు సంబంధం లేకుండా గుండెజబ్బులకు గురవుతున్నారు. ఒక్కప్పుడు వయస్సు మీదపడినవారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ భయపెట్టిస్తోంది. కారణం మారుతున్న జీవనశైలి. ఈ మధ్యకాలంలో భారత్‎లో గుండె జబ్బుల రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గుండెజబ్బుల కారణంగా చిన్నవయస్సులోనే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మీరు తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా. నిజానికి గుండె జబ్బులకు ప్రధాన కారణం ఆహారం, జీవనశైలి.

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‎లో ప్రచురించిన ఓ అధ్యయనంలో మనం తీసుకునే ఆహారమే గుండెపోటు, గుండెజబ్బులకు కారణమవుతుందని పేర్కొంది. గుండెజబ్బులకు దూరంగా ఉండాలంటే మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మీ గుండెను బలంగా ఉంచేందుకు ఆహారంలో తీసుకోవల్సిన చిన్న చిన్న మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెడిటరేనియన్ డైట్ :
క్రిటికల్ రివ్యూస్ ఇన్‎ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‎లో ప్రచురించిన ఒక అధ్యయనం మెడిటరేనియన్ ఫుడ్ మీ గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుందని వెల్లడించింది. ఈ ఫుడ్‎లో కూరగాయలు, పండ్లు, చిక్కుళ్లు, గింజలు, చేపలు ఉన్నాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి గుండెజబ్బు ప్రమాదాన్ని నివారిస్తుంది.

2. DASH డైట్:
ఈ డైట్ హైపర్‎టెన్షన్ బారిన పడకుండా చేస్తుంది. అధికరక్తపోటు గుండెపోటుకు కారణం అవుతుంది. ఈ డైట్ లో చేర్చబడిన ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు ఉంటాయి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం, చక్కెరను మితంగా తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు.

3. ఫ్లెక్సిటేరియన్ డైట్ :
ఈ డైట్ ఫ్లెక్సిబుల్, వెజిటేరియన్‎తో తయారు చేస్తారు. ఇందులో ప్రొటీన్, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. అయితే ఇందులో మాంసం, జంతు ఉత్పత్తులు ఉండవు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం..ఫ్లెక్సిటేరియన్ డైట్ తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గించవచ్చని పేర్కొంది.

4. తక్కువ కార్బ్స్ ఉన్న ఆహారం:
ఈ డైట్‎ పాస్తా, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఉత్పత్తులకు దూరంగా ఉంటుంది. అధిక కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పరిమితం చేస్తుంది. తక్కువకేలరీలు ఉన్న ఆహారం తీసుకునే వారు అధిక బరువు ఉన్న వారికంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

5. మొక్కల ఆధారిత ఆహారం:
ఈ డైట్ లో కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, మాంసం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి.