ఉద్యోగులను తొలగించిన 'మేక్ మై ట్రిప్' - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులను తొలగించిన ‘మేక్ మై ట్రిప్’

June 2, 2020

mf,ktyt

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎందరో ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న సంగతి తెల్సిందే. కొందరు ఉద్యోగులు సగం జీతానికే పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో నష్టాలు వచ్చిన ఎన్నో సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. తాజా ‘మేక్ మై ట్రిప్’ సంస్థ కూడా 350 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 

ఈ సందర్భంగా మేక్ మై ట్రిప్ సంస్థ సీఈఓ రాజేశ్ సంస్థ ఉద్యోగులకు లేఖ రాస్తూ..ఇప్పట్లో పర్యాటక రంగం కొలుకునే అవకాశం లేదు. సంస్థకు ఉద్యోగులను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదు. సంస్థ ఇప్పుడు తీసుకుంటున్న చర్య కంపెనీ భవిష్యత్ కోసం ఆలోచించి చేసింది అని తెలిపారు.