ఓరీ దేవుడా...... అంతగనమా.......... - MicTv.in - Telugu News
mictv telugu

ఓరీ దేవుడా…… అంతగనమా……….

July 22, 2017


యేటా మన దేశంలో ఎంత విలువ చేసే ఫోన్లు తయారు అవుతున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోనే ఎక్కువ ఫోన్లు వాడుతున్న దేశం ఇండియానే. ఇదే అతి పెద్ద డిజిటల్ మార్కెట్ మనదే. ఈ యేడాది మన దగ్గర 90 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లు తయారు అయ్యాయట. కిందటేడు సుమారు 24 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లు దిగుమతి చేసుకున్నామట. ఈ సారి మాత్రం ఏకంగా 54 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లు మన తాన్నే తయారు చేస్తున్నామట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు చెప్పింది. యేటేటా ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య పెరగడమే దీనికి కారణం. 2014-15 మధ్య 18 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లు దిగుమతి చేసుకున్నామట. 2015-16 మధ్య మనమే 54 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లు తయారు చేశామట. ఈ యేడాది 90వేల కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లు మన దగ్గరే తయారయ్యాయట. ఈ లెక్క చూస్తే రెండు చిన్న రాష్ట్రాల వార్షిక బడ్జెట్ సమానంగా ఉన్నట్లుంది ఫోన్ల విలువ.