వయసులో చిన్నవాడితో చేస్తే తప్పేంటి? : మలైకా అరోరా - MicTv.in - Telugu News
mictv telugu

వయసులో చిన్నవాడితో చేస్తే తప్పేంటి? : మలైకా అరోరా

April 23, 2022

డేటింగ్ విషయంలో బాలీవుడ్ భామ మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు చేసింది. వయసులో చిన్నవాడితో డేటింగ్ చేస్తే సమాజం ఎందుకు తప్పుగా చూస్తుందో తనకు అర్ధం కావట్లేదని ప్రశ్నించింది. బోనీకపూర్ మొదటి భార్య తనయుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ విషయంపై సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నకు మలైకా పైవిధంగా స్పందించింది. అంతేకాక, ‘ఓ మహిళ వయసులో తన కంటే చిన్నవాడైనా మగవాడితో రిలేషన్‌లో ఉంటే ఎందుకు తప్పుగా భావిస్తున్నారు. విడాకులు లేదా బ్రేకప్ తర్వాత ప్రతీ మహిళా తన తదుపరి జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. ఇందుకు మా అమ్మ నాకు స్పూర్తి. ఎవ్వరిపై ఆధారపడకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు. ఏం చేయాలనిపిస్తే అది చేసేయ్ అని ఎప్పుడూ చెప్తుండేది. ఆ మాటలను నేను బాగా గుర్తు పెట్టుకున్నాను. అర్జున్ నాకంటే వయసులో చిన్నవాడైనా, నా కంటే ఎక్కువ పొడుగు ఉంటాడు’ అని పేర్కొంది. కాగా, ఇప్పటికే మలైకాకు పెళ్లయి ఓ కొడుకు ఉన్నాడు. విడాకుల అనంతరం అర్జున్ కపూర్‌కు దగ్గరైంది.