మలాలాపై కాల్పుల సూత్రధారి హతం.. - MicTv.in - Telugu News
mictv telugu

మలాలాపై కాల్పుల సూత్రధారి హతం..

September 7, 2017

పాకిస్తాన్ బాలల హక్కుల కార్యకర్తల మలాలా యూసఫ్ జాయ్ పై ఐదేళ్ల కిందట హత్యాయత్నానికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడిని పాక్ భద్రతా బలగాలు హతమార్చాయి. మాలాలాపై కాల్పుల వెనక కీలక పాత్ర పోషించిన తాలిబాన్ కమాండర్ ఖుర్షీద్ ను ఇటీవల కరాచీలో జరిగిన ఎన్ కౌంటర్లో చంపేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని చెప్పారు.  ఖుర్షీద్.. పాకిస్తాన్ తాలిబాన్ చీఫ్ అయిన ముల్లా ఫజ్లుల్లాకు దగ్గరి బంధువు. 2012లో మలాలాపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తలలో తూటాలు దూసుకెళ్లాయి. మొదట ఆమె పాకిస్తాన్ లో చికిత్స పొందింది. తర్వాత మెరుగైన చికిత్స కోసం లండన్ వెళ్లింది.