మలాలా బయోపిక్ ఫస్ట్ లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

మలాలా బయోపిక్ ఫస్ట్ లుక్

September 7, 2017

17 ఏళ్ళ అత్యంత పిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది మలాలా యూసుఫ్ జాయ్. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో సినిమా రానుంది. ఆ బయోపిక్ మూవీ ‘గుల్ మకాయి ’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అంజద్ ఖాన్ ద్వారా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పాకిస్తాన్ లోని తాలిబన్ ఉగ్రవాద అరాచకాలపై గళమెత్తిన ధీర మలాలా. ఆడపిల్లల చదువు గురించి అవిశ్రాంతంగా పోరాడింది. ఆమె జీవిత విశేషాలతో ‘ఐయామ్ మలాలా ’ పేరిట పుస్తకం కూడా వచ్చింది. ఇప్పడు తాజాగా వస్తున్న ఈ సినిమాలో మలాలా పాత్రలో స్టార్ టీవీ సీరియల్ ‘ యే రిష్తా క్యా కెహలాతా హై ’ ఫేం రీమ్ షేక్ పోషిస్తోంది. అలాగే దివంగత ఓంపురి కూడా ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. దివ్యాదత్ కూడా ప్రాముఖ్యమున్న పాత్ర పోషించింది. సినిమా 2015 లోనే ప్రారంభమై అప్పుడు కొంత షూటింగ్ కూడా చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్రం ఆగిపోయి మళ్ళీ నిర్మాణ దశను అందుకుంది. 2018కల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో వున్నారట చిత్ర బృందం.