Home > Flash News > అబ్బబ్బ…ఈ అమ్మాయికి ఏం ఫాలోయింగ్..!

అబ్బబ్బ…ఈ అమ్మాయికి ఏం ఫాలోయింగ్..!

ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్.ఫేస్ బుక్ , వాట్సాప్ , ట్విట్టర్ లో అకౌంట్ మస్ట్. పొద్దున లేస్తే వీటితోనే గుడ్ మార్నింగ్ చెబుతుంటారు.ఇందులో ట్విట్టర్ సంథింగ్ స్పెషల్. అకౌంట్ ఓపెన్ చేసిన ఎంత సెలబ్రెటీలకైనా ఫాలోవర్స్ సంఖ్య లక్ష దాటాలంటే రెండు, మూడు రోజులు పడుతోంది. కానీ పాకిస్థాన్ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్..ని 30 నిమిషాల్లో లక్ష మంది ఫాలో అయ్యారు.నెటిజన్లు ఫాలో ఫాలో మి మలాలా అంటున్నారు.

ఇంతగా ఈమెని ఫాలో కావడానికి బలమైన కారణం ఉంది. తాలిబాన్ల ను ఎదురొడ్డి ఆడ‌పిల్ల‌ల చ‌దువు కోసం ప్రాణాల్ని సైతం లెక్క‌చేయ‌ని డేరింగ్ గర్ల్ మ‌లాలా యూస‌ఫ్ జాయ్… రీసెంట్ గా త‌న స్కూలింగ్ పూర్తి చేసుకున్న మ‌లాలా… శుక్ర‌వారం ట్విట్ట‌ర్ లోకి ఎంటరైంది. హాయ్ ట్విట్ట‌ర్ అంటూ తొలి ట్వీట్ చేసింది. 2012 నుంచే ట్విట్ట‌ర్ అకౌంట్ ఉన్న దాన్ని ఎప్పుడూ ఉప‌యోగించ‌లేదు. ప్రస్తుతం స్కూలింగ్ అయిపోవ‌డంతో ట్విట్ట‌ర్ లో యాక్టివ్ గా ఉండ‌టం కోసం పాత అకౌంట్ నే రీఓపెన్ చేసింది. ట్వీట్లు స్టార్ట్ చేసిన 30 నిమిషాల‌లోనే ల‌క్ష మంది ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆమెకు 4 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

ఇంతకు ముందు మ‌లాలా ఫండ్ అనే ఓ ట్విట్ట‌ర్ అకౌంట్ లో అప్పుడ‌ప్పుడు ట్వీట్లు చేస్తుండేది మ‌లాలా. అయితే.. అది అఫీషియ‌ల్ అకౌంట్ కాదు. త‌న అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ @Malala.ఇక ఎందుకు లేట్…మీరూ ఫాలో అవ్వండి…ఎంతైనా ఇలాంటి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కదా..

Updated : 8 July 2017 2:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top