ఈ హైబ్రిడ్ పిల్ల...మంచి డాన్సర్! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ హైబ్రిడ్ పిల్ల…మంచి డాన్సర్!

July 26, 2017

ఫిదా సిన్మతో  భానుమతిగా అందరి మతి పోగొట్టిన సాయిపల్లవి…అంతకు ముందు  డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది,ఈటీవీలో  వచ్చిన ఢీ 4 లో కంటెస్టెంట్ గా చేసింది,ఢీ5 ప్రోమో కూడా  సాయిపల్లవి మీద స్పెషల్ గా చేసారు.డాన్సర్ గా చాలా స్టేజ్ పర్ఫామెన్స్ లు కూడా ఇచ్చింది,అప్పుడు కూడా తన డ్యాన్స్ తో అందరిని ఫిదా చేసింది,ఆ తర్వాత మళయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాలో  మలర్ గా  తను చేసిన డ్యాన్స్ కి కూడా  చాలామంది ఫిదా అయ్యారు, మొన్న వచ్చిన శేఖర్ కమ్ముల ఫిదాలో కూడా “ వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే”  పాటకు  తన డాన్స్ తో  జోష్ పెంచింది, ఇప్పుడేమో తన డ్యాన్స్ తో పాటు ఆమె నటనకు ఆమె వాయిస్ కూడా  మనోళ్లు చాలా మందే ఫిదా అయ్యారు.

https://www.youtube.com/watch?v=-_H_pLzfbcs