Malayalam actor Sreenath Bhasi arrested for verbally abusing a journalist, later let out on bail
mictv telugu

మహిళా యాంకర్‌తో హీరో అసభ్య ప్రవర్తన.. అరెస్ట్ చేసిన పోలీసులు..

September 27, 2022

మలయాళ స్టార్ హీరో శ్రీనాథ్ భాసీని కేరళ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇటీవల తన రాబోయే చిత్రం చట్టంబి ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రీనాథ్ సదరు మహిళా యాంకర్‏పై అసభ్యపదజాలంతో దుర్భాషలాడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా శ్రీనాథ్‌ తనతో అసభ్యంగా మట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డ్‌ను కూడా ఆమెకు పోలీసులకు ఇచ్చింది.

దీంతో ఆమెపై కోపంతో దుర్భాషలాడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు హీరోని విచారించిన పోలీసులు సోమవారం సాయంత్రం అతడిని అరెస్ట్‌ చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనాథ్‏ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అతడిపై సెక్షన్ 354, 509, 294బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యాంకర్ తనను అగౌరవపరుస్తూ ప్రశ్నలు అడగడంతో తాను సహనం కోల్పోయానని అతడు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను బెయిల్ పై విడుదలైనట్లు తెలిసింది. శ్రీనాథ్ కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.