షాపింగ్ మాల్‌లో హీరోయిన్లకు చేదు అనుభవం.. వీడియో వైరల్
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన నటీమణలకు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. కేరళలోని కాలికట్‌లో ఓ మాల్‌ను సందర్శించిన ఇద్దరు మళయాళం నటీమణులను కొందరు పోకిరీల నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. విపరీతమైన రద్దీలో మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎంట్రన్స్ దగ్గర ఈ పరిస్థితి ఎదురైంది. తనను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఓ నటి చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారు.
#Malayalam actresses #SaniyaIyappan, #GraceAntony sexually #harassed during #filmpromotions
The incident took place when the two #actresses were promoting their upcoming film '#SaturdayNight' at the Hilite mall in #Kozhikode.https://t.co/OO6SgSmlK5#MalayalamActress #Shocking pic.twitter.com/OvBFiAsuz5
— Free Press Journal (@fpjindia) September 28, 2022
మూవీ ఈవెంట్ ముగిసిన తర్వాత తాము తిరిగివస్తుండగా తన కొలీగ్ పట్ల ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, ఇంతలో తన పట్ల ఓ వ్యక్తి అలాగే ప్రవర్తించడంతో తాను షాక్ తిని రియాక్ట్ అయ్యానని వారిలో ఒక నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి పరిస్ధితి జీవితంలో ఎవరికీ ఎదురుకాకూడదని కోరుకుంటున్నానని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో తమ పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిపై సినీ బృందం న్యాయపరమైన చర్యలు చేపడుతుందని ఆమె పేర్కొన్నారు. మాల్ ఎంట్రన్స్ వద్ద లోపలికి వెళ్తున్న హీరోయిన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. ఆమె అతనిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.