హోస్ట్ గా మోహన్ లాల్… - MicTv.in - Telugu News
mictv telugu

హోస్ట్ గా మోహన్ లాల్…

August 22, 2017

టీవీల్లో ఎప్పటికీ సీరియళ్లదే హవా అయినా టీవీ షోలు, రియాల్టీ షోలు , ఈవెంట్లు ధీటుగా ఆదరణ పొందుతున్నాయి.  ఈ షోలన్నీ ఎక్కువగా ఉత్తరాది టీవీ చానళ్ల నుంచి దక్షిణాది  చానళ్లకు దిగుమతి అవుతున్నవే. వెండి తెరపై అలరిస్తున్న కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్లు బిగ్ బాస్ ప్రోగ్రాంలలో హోస్ట్ ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పడు అదే దారిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  తొలిసారి ‘ లాల్ సలాం’ పేరుతో రూపొందుతోన్న టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్నాడు. ఇటీవల ప్రసారం అయిన మెుదటి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ షో మిగతా షోలకు భిన్నమైంది. సమాజంలో మార్పులు తీసుకువస్తున్న వ్యక్తులను ఇందులో ఇంటర్వ్యూ చేస్తారు. సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న వ్యక్తులకు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

సంఘసంస్కర్తలు, సామాజిక సేవలతో పాటు సినీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ షోలో  ఇంటర్వ్యూ చేస్తున్నారు. మెుదటి షోలో సింగర్ చిత్ర, మంజూ వారియర్, టీవీ మాధవన్ అతిథులుగా హాజరయ్యారు.