వెలుగు-చీకటి.. 93 ఏళ్ల కవికి జ్ఞానపీఠ్‌ అవార్డు - MicTv.in - Telugu News
mictv telugu

వెలుగు-చీకటి.. 93 ఏళ్ల కవికి జ్ఞానపీఠ్‌ అవార్డు

November 29, 2019

Malayalam ..

‘వెలుగు దు:ఖం.. చీకటి వరం..’ అంటూ తక్కువ పదాలతో ఎక్కువ భావం పలికిస్తూ చీకటి వెలుగులకు కొత్త అర్థం చెప్పిన ప్రముఖ మలయాళ కవి అక్కితం అచ్యుతన్ నంబూద్రికి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. 93 ఏళ్ల అక్కితం కవితలు మలయాళీల మనసు దోచుకున్నాయి. మలయాళ సాహిత్యాన్ని తన కవితా సంపుటులతో ఆయన సుసంపన్నం చేశారు. 43 పుస్తకాలు రాశారు. 

పాలక్కడ్‌కు చెందిన అక్కితం కేరళీయుల భావోద్వేగాలకు అద్దం పట్టడంలో దిట్ట. ఆయన ప్రసిద్ధ కవితా సంపుటి ‘ఇరుప్పదం నూటందింతే ఇతిహాసం’ (20వ శతాబ్దపు ఇతిహాసం) పేరెన్నిక గన్నది. జ్ఞానపీఠ్‌ అవార్డుకు ఎంపిక కావడంపై అక్కితం స్పందిస్తూ..  ‘నేను రాసిందంతా గొప్పది కాదు, కొన్నితప్పులు చేసి ఉండొచ్చు.. నన్ను క్షమించిండి’ అని అన్నారు. మలయాళ రచయితలకు జ్ఞానపీఠ్‌ రావడం ఇది ఆరోగాసి గతంలో జి. శంకర కురూప్‌ (1965), ఎస్కే పొట్టక్కాట్ (1980), తకళి శివశంకర పిళ్లై (1984), ఎంటీ వాసుదేవన్‌ నాయర్‌ (1995), ఓఎన్‌వీ కురూప్‌ (2007) ఈ అవార్డు అందుకున్నారు.