Malaysia and Indonesia cyberNupur Sharma controversy
mictv telugu

ఏపీ పోలీస్ వెబ్‌సైట్ హ్యాక్.. ప్రవక్తను గౌరవించాలంటూ..

July 9, 2022

Malaysia and Indonesia cyberNupur Sharma controversy

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆమెపై పగతో మలేసియా, ఇండోనేసియా దేశాలకు చెందిన హ్యాకర్లు భారత్‌పై సైబర్ దాడులకు తెగబడుతున్నారు. మన దేశానికి చెందిన 2వేలకు పైగా వెబ్‌సైట్లలోకి చొరబడి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అస్సాంలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెబ్‌సైట్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి చెందిన వెబ్ సైట్‌ను హ్యాక్ చేశారు. పోలీసులు వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు.

అసోం న్యూస్ చానెల్‌ను ప్రత్యక్ష ప్రసార సమయంలో చొరబడి బ్లాక్ స్క్రీన్ వేసి పాకిస్తాన్ బొమ్మ పెట్టారు. ప్రవక్త హజరత్ ముహమ్మద్‌ను గౌరవించాలని, ఈ పని చేసింది పీకే రివల్యూషన్ టీమ్ అని రాశారు నుపుర్ శర్మ వ్యక్తిగత వివరాలతోపాటు కొందరి ఆధార్ కార్డు, పాన్ కార్డ్ వివరాలను లీక్ చేశారు. అహ్మదాబాద్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మొదట ఈ సంగతి గుర్తించి సైబర్ భద్రతాధికారులను అప్రమత్తం చేశారు. హ్యాకర్లపై చర్యలు తీసుకోవాలి మలేషియా, ఇండోనేషియా అధికారులను కోరి ఇంటర్‌పోల్ పోలీసులను కూడా సాయం కోరారు.