ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహార ప్రేమికులు ఉన్నారని తెలుసు. అందుకే మన వంటకాలు ఖండాంతరాల్లో కూడా ప్రసిద్ధికెక్కాయి. కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని రెస్టారెంట్లు. దాని గురించే ఈ కథనం..
A culinary crime has been committed pic.twitter.com/owYQoILSnk
— samantha (@NaanSamantha) January 22, 2023
పప్పుచారు.. పప్పు.. ఇలా కూర ఏదైనా పక్కన రెండు పాపడాలు ఉంటే ఆ టేస్టే వేరు. భారతీయ భోజనంలో పప్పు, పాపడాలనేవి భాగం. మన దగ్గర దాదాపు ఒక్కో పాపడం ధర 2 రూపాయలు కూడా మించదు. ఒక వేళ దానికి మసాలా, ఇతర ఫ్లేవర్లు యాడ్ చేసి ఈ మధ్య అమ్ముతున్నారు. అది కూడా 10 నుంచి 50 లోపలే ఉంటుంది. అది కూడా నలుగురు తినే అంతా పెద్ద పాపడం వస్తుంది.
ఈ పాపడం చరిత్ర ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఎంతలా అంటే ఒక్క ప్లేట్ పాపడాలు అంటే.. అందులో 5 లేదా 6 పాపడాలు పెడతారనుకోండి. దాని ధర 500 రూపాయలు పైన పలుకుతున్నది. మీరు విన్నది నిజం. మలేషియాలోని ఒక రెస్టారెంట్ ‘ఆసియన్ నాచోస్’ పేరుతో వీటిని విక్రయిస్తున్నది.
సమంతా అనే వ్యక్తి ట్విట్టర్ లో ధరతో పాటు డిష్ ముద్రించిన మెనూని కూడా పంచుకున్నది. ఈ చిత్రంలో ఒక ప్లేట్ నిండా పాపడ్స్ ఉన్నాయి.
దీనికి పక్కన అవకాడో, చింతపండు, పెళుసైన షాలోట్స్ తో ఒక బౌల్ ఇస్తారు. దీని ధర 27 మలేషియన్ రింగెట్, అంటే.. రూ. 512.60 అన్నమాట. ఈ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు. అంతేకాదు.. మలేషియా రెస్టారెంట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొందరు మాత్రం సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో.. ‘ప్రతీ ప్లేట్ కు 200శాతం లాభాన్ని గడిస్తుంది, నల్లచుక్కలు ఉండే పాపడాలకు వీరెంత చార్జ్ చేస్తారో కదా! తలుచుకుంటేనే భయమేస్తున్నది’ అంటూ వ్యంగ్యంగా కామెంటుతున్నారు. మరి ఇది నిజంగా అన్యాయమే అనిపిస్తున్నది కదా!