ఇన్స్టాగ్రామ్‌లో డెత్ పోల్..బాలిక ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

ఇన్స్టాగ్రామ్‌లో డెత్ పోల్..బాలిక ఆత్మహత్య

May 16, 2019

మలేషియాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోలింగ్ నిర్వహించుకుని మరీ ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిన సంగటన స్థానికంగా సంచలనం రేకిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సారవాక్‌కు చెందిన 16ఏళ్ల బాలిక ఇన్స్టాగ్రామ్‌లో తాను బతకడానికి అర్హురాలినా? కాదా? అంటూ ఓ పోల్ నిర్వహించింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. “డీ/ఎల్‌” లో ఎంచుకోవడంలో నాకు సహకరించండి అంటూ పోస్ట్ చేసింది.

Malaysian teen believed to have jumped to death after Instagram poll

ఆమె పోస్ట్‌లో డీ అంటే డై/చావడం, ఎల్ అంటే లీవ్/బతకడం అని అర్థం అని అర్థం. అయితే ఈ పోస్ట్‌ను చూసిన వారిలో 69శాతం మంది డీ ఆప్షన్‌కు ఓటు వేయగా.. మిగిలిన 31 శాతం మంది ఎల్ ఆప్షన్‌కు ఓటు వేశారు. దీనిని చూసిన సదరు బాలిక తాను బతకడానికి అర్హురాలిని కాదని నిర్ణయించుకుని.. ఎత్తైన భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మలేసియా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులతోపాటు.. ఆ బాలిక స్నేహితుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.