పాక్‌కు మాల్దీవుల షాక్.. భారత్‌లో ముస్లింలపై వ్యతిరేకత లేదు..  - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌కు మాల్దీవుల షాక్.. భారత్‌లో ముస్లింలపై వ్యతిరేకత లేదు.. 

May 23, 2020

Maldives Shoots Down Pakistans Attempt

ఏదో ఒక వంకతో విష ప్రచారం చేస్తూ..  భారత్‌‌పై నిందలు వేయాలని దాయాది దేశం పాకిస్తాన్ ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు భంగపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా చేసిన ఓ ప్రయత్నం బెడిసి కొట్టింది. భారత దేశంలో ముస్లింలపై వ్యతిరేకత పెరుగుతోందంటూ ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నాలు చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) సమావేశంలో ముస్లిం దేశాలను ఏకం చేయాలని భావించింది. కానీ ఆదిలోనే పాక్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. పాక్ ఆరోపణల్లో వాస్తవం లేదని  ఓఐసీలోని మాల్దీవ్స్ శాశ్వత ప్రతినిధి తిల్మీజా హుస్తేన్  స్పష్టం చేశారు. తాము ఇటువంటి చర్యలకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

కేవలం సోషల్ మీడియా ప్రచారాలను ఆధారంగా చేసుకొని ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి ప్రచారం చేస్తున్నట్టుగా అభిప్రాయపడ్డారు. దీని వెనక కచ్చితంగా ఐఎస్ఐ కుట్రం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఒకరిద్దరి అంశాలను తీసుకొని 130 కోట్ల మంది అభిప్రాయాలకు ప్రతిరూపంగా పరిణగించలేమని పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగ ఇలాంటివి చేస్తే తాము మద్దతు ఇచ్చే ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ముస్లిం దేశాలతో  భారత్‌కు సన్నిహిత దౌత్యసంబంధాలు ఉన్నాయని  గుర్తు చేశారు. కాగా 57 ముస్లిం సభ్య దేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. మాల్దీవ్ ప్రతినిధి చేసిన ప్రసంగంతో ఇప్పుడు పాక్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మెజార్టీ దేశాలు కూడా పాక్ చర్యను తప్పుబడుతూనే ఉన్నాయి.