Home > Featured > కలికాలం..మేకపోతు పాలిస్తోందంట..

కలికాలం..మేకపోతు పాలిస్తోందంట..

Male goat giving milk in anantapur

చైనాలో కరోనా వైరస్ బ్రేక్ అవుట్ అయినప్పుడు ఈ విషయం బ్రహ్మం గారు ముందే చెప్పారని ప్రచారం జరిగిన సంగతి తెల్సిందే. ఏ వింత సంఘటన జరిగినా దాని గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారని ప్రచారం జరుగుతున్నది. తాజాగా అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లిలో ఓ వింత సంఘటన జరిగింది.

గ్రామంలోని కుమ్మరి నాగన్నకు చెందిన మేకపోతు పాలు ఇస్తోంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి

మేకపోతు పాలు ఇవ్వడాన్ని చూస్తున్నారు. దీని గురించి కూడా బ్రహ్మం గారు ముందే చెప్పారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేకపోతు పాలివ్వడం ఇదే మొదటిసారని, విచిత్రంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. సుక్కులమ్మకు జంతుబలి ఇచ్చేందుకు ఈ మేకపోతును పెంచుతున్నామని యజమాని తెలిపాడు.

Updated : 1 May 2020 6:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top