Male tiger Miron aggressiveness takes life England knowsley safari
mictv telugu

ఈ మగపులి ఓ సైకో.. శృంగారం చేసి చంపేస్తుంది!

November 18, 2022

అమ్మాయిలను దారుణంగా అత్యాచారాలు చేసి, చంపేసే మగవాడిని ‘మృగాడు’ అంటాం. మరి మృగమే అలాంటి పనిచేస్తే? జంతువులు నిజానికి అలాంటి ఘోరాలేం చెయ్యవు. కానీ ఎక్కడ తేడా కొట్టిందోగాని ఓ మృగం అలాంటి నేరాలు ఘోరాలు చేస్తోంది. ఆడపులులతో జత కట్టాక పీక కొరికి, పంజా విసిరి చంపేస్తోంది. దీని మానసిక ప్రవర్తన విపరీతంగా ఉందని, అందుకే ఇలాంటి ఘోరాలకు తెగబడుతోందని జూ సిబ్బంది చెపుతున్నారు. ఇంగ్లండులోని పెస్కోట్ ప్రాంతంలోని ఉన్న నోస్లీ సఫారీలో ఈ దారుణం జరిగింది.

అమూర్ అనే అంతరించిపోతున్న పులులతో ఇక్కడ బ్రీడింగ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమూర్ జాతి పులులు 500 మాత్రమే మిగిలి ఉన్నారు. సఫారీలో ఉన్న మైరాన్ అనే ఆరేళ్ల మగపులి సిండా అనే 14 ఏళ్ల మగపులితో శృంగారం చేస్తూ చేస్తూ చంపేసింది. ఇవి గతంలో పలుమార్లు బ్రీడింగ్‌లో పాల్గొన్నాయని, అయితే మైరాన్ మైండులో ఏదో జరుగుతోందని సిబ్బంది మాట. మైరాన్ ఇదివరకు కోపెన్‌హాగెన్ జూలో ఉన్నప్పుడు కూడా ఓ ఆడపులిని పీక కొరికి చంపేసింది. మైరాన్ మృగాడికి ఆడపులులంటే బాగా కోపమని, ఎప్పుడు చిరుబురులాడుతూ ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అయితే శృంగారంలో కొన్నిసార్లు చక్కగానే పాల్గొనడంతో నమ్మి ఆడపులులను దాని దగ్గరికి పంపామని, ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. అడవుల్లో ఉండే మగపులులు కొన్ని ఆడపులులను చంపడం మామూలేనని, పార్కుల్లోని పులుల్లో ఇలాంటి విపరీత ప్రవర్తన వింతేనని అంటున్నారు.