మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను ప్రారంభించిన: కేసీఆర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ను ప్రారంభించిన: కేసీఆర్‌

February 23, 2022

 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్‌‌ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. అనంతరం నీటిని విడుదల చేసి, మల్లన్న సాగర్‌ను కేసీఆర్ జాతికి అంకితం చేశారు. 50 టీఎంసీలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 15 లక్షల 71 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. దేశంలోనే తొలిసారి నదిలేని చోట ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందించనున్నారు.

మరోపక్క సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో 2018లో రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌–4లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును తొలుత టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించాలనుకున్నా రీ డిజైన్‌ చేసి 50 టీఎంసీలకు పెంచారు. రూ.6,805 కోట్ల బడ్జెట్‌తో మూడున్నర ఏళ్లలోనే పూర్తి చేశారు. ప్రాజెక్టు కోసం 17,781 ఎకరాల భూమిని సేకరించారు. 8 పంచాయతీలతోపాటు మొత్తం 14 నివాస ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురైనట్లు అధికారులు తెలియజేసిన విషయం తెలిసిందే.