mallareddy college students protest for hall tickets , attack on college buses
mictv telugu

మల్లారెడ్డి కాలేజీ బస్సులపై రాళ్ల దాడి

June 4, 2022

 

mallareddy college students protest for hall tickets , attack on college buses

హాల్ టికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.  పరీక్ష సమయం దాటిపోతున్నా హాల్ టికెట్లు ఇవ్వకపోవడం..  హాల్ టికెట్లు ఉంటేనే పరీక్షకు అనుమతిస్తామని సెంటర్ నిర్వాహకులు చెప్పడం.. ఇదంతా విద్యార్ధుల అసహనానికి  దారి తీసింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో( Minister Mallareddy Engineering college) ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం MRCE మొదటి ఏడాది పరీక్షలు జరుగుతున్న క్రమంలో యాజమాన్యం..  విద్యార్థులకు ఉదయం పరీక్షకు హల్ టికెట్లు ఇవ్వలేదు. దీంతో ఉదయం జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షకు కూడా హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఆగ్రహంతో బస్సులు, కళాశాల బిల్డింగ్ పై రాళ్లు రువ్వారు విద్యార్థులు. విద్యార్థుల దాడిలో పలు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులు విధ్వంసానికి దిగడంతో మల్లారెడ్డి కాలేజీ క్యాంపస్ లో ఉద్రిక్తత తలెత్తింది. కొందరు విద్యార్థులు కాలేజీకి లోపలికి వెళ్లి.. కార్యాలయ అద్దాలపై రాళ్లు విసిరారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో స్పాట్ కు వచ్చిన పోలీసులు.. విద్యార్థులను చెదరగొట్టారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.