Mallareddy's Rs. 6 crores seized by the IT department
mictv telugu

మల్లారెడ్డి ఆస్తులపై సోదాల్లో 6 కోట్ల నగదు లభ్యం : ఐటీ శాఖ

November 23, 2022

Mallareddy's Rs. 6 crores seized by the IT department

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు రూ. 6 కోట్ల నగదు దొరికిందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న విద్యాలయాల్లో నిర్దేషించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినట్టు గుర్తించినట్టు తెలిపారు.

లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో రియల్ ఎస్టేట్ లోకి మళ్లించడంతో పాటు మల్లారెడ్డి – నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చిస్తున్నట్టు ఆధారాలు సేకరించామన్నారు. స్థిరాస్తుల విలువ కూడా తక్కువగా చూపించారని పేర్కొన్నారు. మంత్రి వియ్యంకుడు వర్ధమాన్ కాలేజీ డైరెక్టర్ గా ఉండడంతో అక్కడ కూడా సోదాలు జరిపామని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఇప్పటికే సోదాలు ముగియగా, మరికొన్ని ఈ రాత్రికి ఇంకొన్నిచోట్ల రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. కాగా, ఈ దాడుల్లో హైదరాబాద్ రీజియన్ అధికారులతో పాటు ఒడిషా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 టీంలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. అటు దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. అన్ని అనుమతులతోనే ఆసుపత్రులు, కాలేజీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అన్ని ఆస్తుల వివరాలు అందజేసి అధికారులకు సహకరిస్తున్నామని, ఈ దాడుల వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. గురువారం ఉదయం వరకు సోదాలు జరిగే అవకాశం ఉందన్నారు.