Mallika Sherawat compares Deepika Padukone's 'Gehraaiyaan' to her film 'Murder'
mictv telugu

దీపికపై మల్లికా శెరావత్‌ కామెంట్స్.. హీరోయిన్ అంటే ఆ రెండు పాత్రలే..

July 14, 2022

బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 15 ఏళ్ల క్రితం విడుదలైన ‘మర్డర్‌’ సినిమా సమయంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు తనను మానసిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపించింది. ఆ సమయంలో వాళ్లు తన టాలెంట్ గురించి కాకుండా కేవలం తన శరీరం గురించే మాట్లాడేవారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే సినిమాను ఉదాహరిస్తూ.. దీపికా ‘గెహ్రాయియా’ సినిమాలో చేసింది తాను 15 ఏళ్ల కిందటే ‘మర్డర్’ సినిమాలో చేశానని చెప్పుకొచ్చింది. కిస్సింగ్ సీన్లు, బికినీ గురించి ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని, కానీ, ఇవన్నీ తాను దీపిక కంటే ముందే చేశానని చెప్పింది. అప్పటి ప్రేక్షకుల ఆలోచనలు కాని.. బుద్ది కాని అంతగా ఎదగలేదని విమర్శించింది. అటువంటి టైమ్ లోనే తాను అవన్నీ లెక్క చేయకుండా సాహసం చేశానంటోంది.

ఎంతసేపు సినిమాలో తన శరీరం గురించి, అందం గురించి, ఎక్స్ ఫోజింగ్ గురించే మాట్లాడతారే కానీ, తన యాక్టింగ్ స్కిల్స్‌ను గుర్తించేవారు కారని మల్లికా బాధపడింది. మొదట్లో హీరోయిన్లు పద్దతిగా సావిత్రి టైపులో అతి మంచితనంతో ఉండేవారని.. అందుకే వారికోసం అలాంటి పాత్రలే రాశారన్నారు. అప్పట్లో ఏమీ తెలియని అమాయక పాత్రలు ఉండేవి.. లేకుంటే క్యారెక్టర్ లేని వ్యాంప్‌లుగానే ఉండేవారని మల్లిక వివరించింది. నాటి హీరోయిన్ల కోసం ఈ రెండు తరహా పాత్రలే రాసేవారని.. అంతకు మించి ఆప్షన్ లేక తాము ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చిదంటోంది ఈ సీనియర్ బ్యూటీ.