మల్లికా ఎంత పని చేసావ్ ?
The love of my life - my little nephew ❤️??#family pic.twitter.com/Hg5mvkNUjF
— Mallika Sherawat (@mallikasherawat) June 14, 2017
సన్నిలియోని రాకమునుపు హాట్ ప్రేక్షకులకు ఆరాధ్య దేవత మల్లికా శెరావతే. మర్డర్ సినిమాతో ఏక్ దమ్ అందరి నజర్ ను తన వైపు తిప్పుకున్న తిప్పులా( లే )డి మల్లికా. ఆ తర్వాత హిందీలో చాలా సినిమాలే చేసింది. ఫ్యామిలీ టైపాఫ్ సినిమాల్లో కామెడీ రోల్స్ కూడా చేసింది. ఆ తర్వాత జాకీచాన్ సినిమాలో వచ్చిన అవకాశంతో హాలీవుడ్ కి కూడా వెళ్ళి అక్కడ కూడా తన పాగా వేసింది. ‘ హిస్స్ ’ అనే సినిమాతో అక్కడ తన చరిష్మా గట్టిగానే చాటుకుంది. ఏంటో గానీ కొంత కాలంగా మీడియా దృష్టికి రాకుండా సైలెంటుగా వుండిపోయింది. సడెన్ గా తన ట్విట్టర్ ఖాతాలో ఒక చిన్న బాబుతో ఆడుకుంటూ వీడియో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో చూసినవాళ్ళంతా ఏంటి మల్లికా అప్పుడే పెళ్ళి చేస్కొని పిల్లాణ్ని కూడా కందా ? అని షాకైయ్యారు గానీ.. తను నా మేనల్లుడని వీడియో పైన స్టేటస్ కూడా పెట్టింది.. హమ్మయ్య అని వూపిరి పీల్చుకున్నట్టున్నారు ఆమె హాట్ హాట్ ఫ్యాన్స్ !!