Mallikarjun Kharge Called PM Modi Ravana
mictv telugu

మీరు వంద తలల రావణుడ్ని చూశారా?

November 29, 2022


గుజరాత్‌లో క్లయిమాక్స్ వార్ హై రేంజ్‌లో నడుస్తోంది. నేతల మధ్య మాటలతూటాలు శ్రుతి మించుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కంట్రోల్ తప్పారు. ప్రధాని మోదీని వంద తలలు ఉన్న రావణుడు అని పోల్చారు. దీనికి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

కాంగ్రెస్ ఎటాక్

గుజరాత్ క్యాంపెయిన్ హీటెక్కింది. అగ్రనేతల ప్రచారంతో ఊపందుకుంది.బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఏడోసారి విజయం కోసం తపిస్తున్న బీజేపీకి బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. గుజరాతీలను ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. కాంగ్రెస్ కొత్త బాస్ మల్లికార్జున ఖర్గే గుజరాత్ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.”మీరు ఎప్పుడైనా వంద తలలు ఉన్న రావణుడిని చూశారా? చూడకపోతే నేను మీకు చూపిస్తా..ఆ వందల తలలు రావణుడు మోదీనే.మున్సిపల్ , కార్పొరేషన్ ,అసెంబ్లీ ఎన్నికలు..ఎవైనా ఆయనే కనిపిస్తారు. తన పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు.గెలిచాక మోదీ వచ్చి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారా?మీకు ఎన్ని సార్లు సాయం చేశారు?”అన్ని ఖర్గే ఫైర్ అయ్యారు.

బీజేపీ కౌంటర్
ప్రధానిపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించింది. “గుజరాత్ లో ఖర్గే లేని ఉద్రిక్తతలకు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓడిపోతారని తెలిసి ఆయన సహనం కోల్పోయారు. దేశ ప్రధానిని ఇలా మాట్లాడటం మంచిది కాదు.గుజరాతీ ఓటర్లను కాంగ్రెస్ కించపరుస్తుంది” అని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.

మోదీని రావణ్‌తో పోల్చడంపై ఖర్గేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మరో బీజేపీ నేత సంబిత్ పాత్ర. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మైండ్ సెట్ ఎంటో దేశానికి అర్థమైపోయిందన్నారు. “ప్రధాని మోదీ గుజరాత్‌కు గర్వకారణం.ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఖర్గే వ్యాఖల్ని చూస్తే సోనియా, రాహుల్ గాంధీల నైజంఎంటో తెలుస్తుంది. ప్రజలు ఈసారి కూడా బుద్ధిచెబుతారు.” అని సంబిత్ పాత్ర అన్నారు.

మొత్తానికి గుజరాత్ లో ప్రచారం చివరి అంకానికి చేరింది. తీన్మార్ వార్‌లో మాటలయుద్ధం ముదిరింది. డిసెంబర్ 1, 5న రెండు విడతలలో పోలింగ్ జరుగుతోంది. 8న తేదీన ఓట్లను లెక్కిస్తారు.