Mallikarjuna Kharge won as the president of the Congress party
mictv telugu

కాంగ్రెస్ అధ్యక్ష ఫలితాల వెల్లడి.. ఊహించిందే జరిగింది

October 19, 2022

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఇద్దరు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీపడగా, అందరూ ఊహించినట్టే ఖర్గే ఘన విజయం సాధించారు. ఖర్గేకు మొత్తం 7,897 ఓట్లు రాగా, థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి.

24 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. అటు అన్నేళ్ల తర్వాత గాంధీ కుటుంబం వెలుపల వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపడుతుండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫలితాల వెల్లడికి ముందు మరో అభ్యర్ధి శశిథరూర్ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌‌లో పోలింగ్ సందర్భంగా రిగ్గింగ్‌తో పాటు అవకతవకలు జరిగాయని చెప్పారు. ఓట్ల లెక్కింపులో యూపీ ఓట్లను లెక్కలోకి తీసుకోవద్దని ఎలక్షన్ అథారిటీ చైర్మెన్ మిస్త్రీని కోరారు. ఈ మేరకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా థరూర్ ఫిర్యాదును లెక్కలోకి తీసుకోకపోవడం ప్రస్తావనార్హం.