mallojala koteswara rao, venugopal rao mother died
mictv telugu

మల్లోజుల మాతృమూర్తి మధురమ్మ మృతి..

November 1, 2022

మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావుల తల్లి మల్లోజల మధురమ్మ(98) మంగళవారం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మధురమ్మ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అనేకసార్లు అనారోగ్యానికి గురైనా తిరిగి కోలుకున్నారు.

నాలుగు నెలల క్రితం అనారోగ్యానికి గురై కోలుకున్న మధురమ్మ.. తిరిగి నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు వదిలారు. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలమైన పెద్దపల్లికి తీసుకువస్తున్నారని తెలిసింది.