మాస్క్ ఉంటేనే మాల్స్‌లోకి ఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ ఉంటేనే మాల్స్‌లోకి ఎంట్రీ

March 27, 2020

Malls Entrance into Wearing Masks  

కరోనా వైరస్‌ను కట్టడిచేయడానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు ప్రజలు. కేవలం నిత్యావసర సరకులు మాత్రమే అందించే మాల్స్, షాపులు తెరుచుకుంటున్నాయి. అది కూడా కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఆ సమయంలోనే ఏవైనా అవసరాలు ఉంటే తీర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమ మాల్స్‌కు వచ్చే వినియోగదారులు కూడా కొన్ని నిబంధనలు పాటించాలనిసూచిస్తున్నాయి. 

మాల్స్‌కు వచ్చే ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచిస్తున్నాయి. లేకపోతే అనుమతించేది లేదని పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. దీని కోసం మాల్స్ బయట ముందుగానే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. మనిషికి మనిషి దగ్గరగా ఉండకుండా.. మాస్కులు,శానిటైజర్లు వాడుతున్నారు.