మా చేపముల్లును మాకిచ్చేయండి.. బ్రిటన్‌కు చిట్టిదేశం డిమాండ్  - MicTv.in - Telugu News
mictv telugu

మా చేపముల్లును మాకిచ్చేయండి.. బ్రిటన్‌కు చిట్టిదేశం డిమాండ్ 

September 29, 2020

Malta calls for return of shark tooth gifted to Prince George by Sir David Attenborough

చరిత్రలో చేతులు మారిన వస్తువుల కోసం ఇప్పటికీ ఎన్నో తగాదాలు ఉన్నాయి. ముఖ్యంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్.. వివిధ దేశాల నుంచి దోచుకున్న అమూల్య సంపదను తిరిగి వాటికి ఇవ్వాలనే డిమాండ్ బాగా ఊపందుకుంటోంది. అరుదైన భారతీయ పంచలోహ విగ్రహాల నుంచి, అంత్యంత అరుదైన ఈజిప్షియన్ మమ్మీల వరకు గుట్టల కొద్దీ విదేశీ సంపద బ్రిటన్ మ్యూజియాల్లో మూలుగుతోంది. సంపద అంటే అవి మాత్రమే కాదని, తమ గడ్డపై నుంచి ఎత్తుకెళ్లిన ప్రతిదీ తమకు విలువైందేనంటూ యూరప్ ఖండంలోని చిట్టిదేశం మాల్టా కొత్త డిమాండ్ ఎత్తుకుంది. 

తమ దేశం నుంచి పట్టుకెళ్లిన షార్క్ చేప దంతాన్ని తిరిగి తమకు మర్యాదగా అప్పగించాలని బ్రిటన్ రాజకుటుంబాన్ని డిమాండ్ చేస్తోంది. ఇంతకీ కథ ఏమిటంటే.. ఆ దంతం అలనాటి బ్రిటిష్ దోపిడీ ప్రభుత్వం ఎత్తుకెళ్లింది కూడా కాదు. ప్రముఖ సినీ దిగ్గజం ఆటెన్‌బరో దశాబ్దాల కిందట దాన్ని బ్రిటన్‌కు తీసుకెళ్లాడు. తాజాగా బ్రిటన్ యువరాజు విలియం కొడుకు జార్జికి దాన్ని ఆయన కానుకగా ఇచ్చాడు. ఆ పిల్లవాడు దాన్ని తెగ మురిపెంగా చూసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్టా ఆ పంటిని తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అది 2.3 కోట్ల ఏళ్ల నాటి 50 అడుగుల పొడవైన చేపదని, దాన్ని తమ దేశ మ్యూజియంలో పెట్టి కాపాడుకుంటామని మాల్టా సాంస్కృతిర శాఖ మంత్రి జోస్ హెరెరా అన్నారు. సదురు షార్క్ చేప ఎప్పుడో అంతరించిపోయింది కనుక దాని ఆనవాళ్లు తమకెంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. మాల్టా 1964లో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందింది.