పూజారులకు 1000 పింఛన్, ఉచిత ఇల్లు.. సీఎం  - MicTv.in - Telugu News
mictv telugu

పూజారులకు 1000 పింఛన్, ఉచిత ఇల్లు.. సీఎం 

September 14, 2020

Mamata announces monthly allowance free housing for Brahmin priests

బ్రాహ్మణ పూజారులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. పూజారులకు నెలకు రూ.1000 అలవెన్స్, 8 వేల మందికి పైగా పేద సనాతన బ్రాహ్మణ పూజారులకు ఉచిత ఇళ్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. బ్రాహ్మణ శాఖలో చాలామంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని అన్నారు. అందుకే వారికి నెలకు రూ.1000 ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తామని దీదీ హామీ ఇచ్చారు. 

గతంలో తమ ప్రభుత్వం సనాతన బ్రాహ్మణులకు అకాడమీ స్థాపించేందుకు కోలాఘాట్‌ వద్ద భూమిని అందించినట్టు మమత గుర్తు చేశారు. హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మమత ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తుందని అన్నారు. ‘ఇక్కడ భాషాపరమైన భేదాలేవీ లేవు. మేము అన్ని భాషలను గౌరవిస్తాం. కొత్తగా హిందీ అకాడమీని ప్రారంభించాలని నిర్ణయించాం. అంతేకాకుండా దళిత సాహిత్య అకాడమీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని మమత స్పష్టంచేశారు. కాగా, వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత బ్రాహ్మణులపై వరాలు కురిపించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.