Mamata Banerjee delights locals by making puchka at a stall in Darjeeling. Pics and video
mictv telugu

పానీ పూరీ అమ్మిన బెంగాల్ సీఎం … వీడియో వైరల్

July 12, 2022

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. డార్జిలింగ్‌లో మంగళవారం ఓ స్టాల్‌ వద్దకు వెళ్లి, పానీపూరి తయారు చేసి, అందరికీ పంచారు. దీంతో అక్కడ ఉన్నవారంతా సంభ్రమాశ్చర్యాలకులోనయ్యారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. మమతా బెనర్జీ పర్యటన మూడ్రోజుల పాటు కొనసాగనుంది.

కాగా, తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ విక్రయించారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. మమత మార్చిలో కూడా డార్జిలింగ్‌లో ఓ మోమో స్టాల్ వద్ద అమ్మకందారులకు సాయపడ్డారు. ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.