10 కి.మీ పరిగెత్తిన ముఖ్యమంత్రి..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

10 కి.మీ పరిగెత్తిన ముఖ్యమంత్రి..వీడియో

October 25, 2019

Mamata Banerjee Jogs 10 km With In the Hills Of Darjeeling

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరు పదుల వయసులో 10 కిలోమీటర్లు పరిగెత్తి అందరిని ఆశ్చర్యపరిచారు. ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ క్లైమేట్‌ యాక్షన్‌’ సందర్భంగా డార్జిలింగ్‌ కొండలపై ఉత్సాహంగా జాగింగ్‌ చేశారు. డార్జిలింగ్‌లోని కూర్సేయాంగ్‌ నుంచి పరుగు ప్రారంభించారు. మార్గ మధ్యలో స్థానికులను పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కర్భన ఉద్గారాల నియంత్రణ వంటి అంశాలపై మమత మాట్లాడారు. జాగింగ్‌ చేస్తున్న సమయంలో ఆమె వెంట భద్రతా సిబ్బందితో పాటు పలువురు జర్నలిస్టులు కూడా పరిగెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను మమత ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ క్లైమేట్‌ యాక్షన్‌ సందర్భంగా మన భూమిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిఙ్ఞ చేద్దాం. పచ్చదనాన్ని కాపాడండి. పరిశుభ్రంగా ఉండండి’ అని ఆమె పిలుపునిచ్చారు.