Mamata Banerjee-led opposition meeting begins in delhi
mictv telugu

దీదీ భేటీకి 8 మంది సీఎంల డుమ్మా.. కొనసాగుతున్న మీటింగ్

June 15, 2022

Mamata Banerjee-led opposition meeting begins in delhi

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి పోటీగా విపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టడానికి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలు ఆరంభంలోనే బెడిసికొడుతున్నాయి. ఇంతకు ముందు కేసీఆర్ రానని చెప్పేయగా, తర్వాత కేజ్రీవాల్ కూడా కేసీఆర్ బాట పట్టారు. దీదీ పిలిచిన 8 మంది ముఖ్యమంత్రులు ఈ భేటీకి రాకపోవడంతో విపక్షాల ఐక్యత ప్రశ్నార్ధకమవుతోంది.

ఇదిలా ఉండగా, దీదీ నేతృత్వంలో ఈ భేటీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ భవనంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సింగ్ సుర్జేవాలా హాజరయ్యారు. శివసేన తరపున ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది వచ్చారు. ఎన్సీపీ తరపున శరద్ పవార్, ఎస్పీ తరపున అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నుంచి దేవేగౌడ, కుమార స్వామి, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఐ నుంచి డి.రాజా వంటి వారు హాజరయ్యారు. వచ్చిన నేతలను దీదీ బయటికి వచ్చి స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీకి శరద్ పవార్ సుముఖంగా లేకపోవడంతో గతంలో ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడితో పోటీ పడిన గాంధీ – రాజ గోపాల చారి మనవడు గోపాల కృష్ణ గాంధీని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరి చూద్దాం భేటీ తర్వాత ఆమె ఏం చెప్తుందో.