Home > Featured > చాయ్ అమ్మిన మమతా బెనర్జీ.. నెటిజన్లు ఫిదా

చాయ్ అమ్మిన మమతా బెనర్జీ.. నెటిజన్లు ఫిదా

సాదాసీదాగా ఉండే ముఖ్యమంత్రుల్లో ఒకరు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సామాన్య పౌరుడిలా నిరాడంబరంగా జీవిస్తారు. తన హోదాను, దర్పాన్ని ఏ మాత్రం చూపించని వ్యక్తిత్వం ఆమెది. ఇంత సామాన్యంగా ఉండే మమతా బెనర్జీ మరోసారి అందరిని ఆశ్చర్యపరిచారు. రోడ్డుపక్కనే ఉన్న టీ షాపులోకి వెళ్లి చాయ్ అమ్మారు. స్థానిక ప్రజలకు తానే స్వయంగా చాయ్ అందించి సంతోషపరిచారు. ఓ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకొని లాలించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా దిఘాలోని దత్తాపూర్‌లో టీ షాప్ దగ్గర మమత తన కాన్వాయ్ ఆపించారు. వెంటనే కారులోంచి దిగి దుకాణదారుడి వద్దకు వెళ్లి అతడితో ముచ్చటించారు. తర్వాత టీ తయారు చేయడం ప్రారంభించారు. సీఎం వచ్చినట్టు తెలిసిన వెంటనే చాలా మంది అక్కడికి వచ్చారు. సెక్యూరిటీ అడ్డుకునే యత్నం చేయడగా సీఎం వారిని వారించారు. దూరంగా వెళ్లాంటూ గన్‌మెన్లను ఆదేశించారు. అక్కడికి వచ్చిన వారికి టీ అందించి కొంత సేపు ముచ్చటించారు. దీన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చిన్న చిన్న పనులు జీవితాన్ని ఆనంద పరుస్తాయి’అనే క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Updated : 21 Aug 2019 11:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top