మోదీ భార్యకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానుక.. - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ భార్యకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానుక..

September 18, 2019

Mamata Banerjee Meet Modi Wife In Airport

ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీరిద్దరూ రాజకీయాల్లో భిన్న ధృవాలు. ఒకరికొకరు రాజకీయంగా బద్ధ విరుదోలు. కానీ వాటన్నింటిని పక్కనపెట్టి సమావేశం అయ్యేందుకు సిద్ధమైన సమయంలో అరుదైన ఘటన జరిగింది. నేడు మోదీతో భేటీ అయ్యేందుకు వెళ్తున్న మమతా బెనర్జీకి ప్రధాని భార్య అనుకోకుండా కనిపించారు. తొలిసారి వీరిద్దరూ కలుసుకోవడంతో ఆమెకు గుర్తుగా ఓ బహుమతిని అందజేశారు మమతా బెనర్జీ. 

జశోదాబెన్‌ను ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ వెళుతూ కోల్‌కత్తా ఎయిర్ పోర్టులో ఆగారు. అదే సమయంలో ఢిల్లీకి వెళ్తున్న మమతా బెనర్జీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆమెను చూసిన మమత దగ్గరుకు వెళ్లి 

కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ సతీమణికి మమత ఒక చీరను బహుమతిగా ఇచ్చారు. ప్రధానిని కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ అరుదైన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరిద్ధరి ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాగా రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానితో మమత చర్చించనున్నారు.