మోదీ ఓ పిచ్చి తుగ్లక్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ఓ పిచ్చి తుగ్లక్

November 24, 2017

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీని  పిచ్చి తుగ్లక్‌గా పేర్కొన్నారు. ఆమె శుక్రవారం కోల్‌కతాలో జరిగిన ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మోదీ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘ఆయన బెంగాల్‌లో పెట్టుబడులు పెట్టనివ్వకుండా వ్యాపారవేత్తలను భయపెడుతున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య వ్యవస్థ మలిక విలువలను కాలరాస్తున్నారు. దేశంలో ఇప్పుడు  సహకార సమాఖ్యవ్యవస్థ లేదు. దారుణమైన ఎమర్జెన్సీ నడుస్తోంది..’ అని విమర్శించారు. అధిక పన్నులతో కేంద్రం ప్రజల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ మీడియాను సైతం ఆంక్షలతో నియంత్రిస్తున్నారని, దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై తీవ్రమైన దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.