Mammoth excavated in Canada gold fields
mictv telugu

బంగారు గనుల్లో తవ్వకాలు.. బయటపడ్డ వింత ఆకారం

June 27, 2022

కెనడాలోని బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా, నల్లటి రంగులో ఉన్న వింత ఆకారం ఒకటి బయటపడింది. పరిశీలించి చూడగా, అది పూర్తిగా గడ్డకట్టుకుపోయిన పిల్ల మమూత్ అని తేలింది. పూర్తి వివరాలు.. జూన్ 21న కొందరు పురావస్తు శాఖ అధికారులు క్లోన్ డికే బంగారు గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఆ సమయంలోనే మమూత్ బయటపడింది. దానిని సుమారు 30 వేల ఏళ్ల క్రితం మంచు గడ్డ కట్టే కాలానికి చెందినదని అంచనా వేస్తున్నారు. విశేషమేంటంటే.. దానిపై చర్మం, వెంట్రుకలు అలానే ఉన్నాయి. దాంతో పరిశోధకులు మరింత ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్ నెట్‌లో వైరల్ అవుతున్నాయి.