Mamta Mohandas diagnosed with autoimmune disease vitiligo after successful battle with cancer
mictv telugu

క్యాన్సర్ తో పోరాడింది.. ఇప్పుడు చర్మవ్యాధితో బాధపడుతోంది!

January 16, 2023

Mamta Mohandas diagnosed with autoimmune disease vitiligo after successful battle with cancer

యమదొంగతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కొన్ని సినిమాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకుంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ధైర్యంగా పోరాడి జయించింది. ఇప్పుడు మళ్లీ విటిలిగోతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

స్టార్ నటి సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నది. ఆమె అనారోగ్యం నుంచి కోలుకోక ముందే మరొక నటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆమె మరెవరో కాదు.. మమతా మోహన్ దాస్. ఆమె విటిలిగో అనే చర్మ సమస్య బారిన పడినట్లు చెప్పింది. అంతకుముందు మమతా క్యాన్సర్ తో పోరాడి జయించింది. ఈమె యమదొంగలోనే కాకుండా కింగ్, కేడీ, కృష్ణార్జున సినిమాలో కనిపించింది.

సోషల్ మీడియాలో.. మ

‘ప్రియమైన సూర్యుడా.. ! మునుపెన్నడూ లేనివిధంగా ఇప్పుడు నిన్ను ప్రేమగా హత్తుకుంటున్నా. నా చర్మం రంగు కోల్పోతుంది. కాబట్టే నీ ముందుకొచ్చా. నువ్వు రాకముందే నీ కోసం నిద్ర లేచి, నీ నులివెచ్చని కిరణాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. నీ శక్తిని నాకు ఇవ్వు. నేను నీకు రుణపడి ఉంటాను. ఇక పై ఎప్పటికీ నీ పై దయతో ఉంటాను’ అంటూ మమతా మోహన్ దాస్ పోస్ట్ పెట్టింది. మరొక సందర్భంలో.. ‘మళ్లీ మళ్లీ దేవుడు నా మీద వక్రమైన బంతులను విసురుతున్నాడు. ఒక్కొక్కటి చాలా బరువుగా అనిపిస్తున్నాయి. నా సంకల్ప శక్తి, కండరాలు అంత బలంగా ఉండకపోవచ్చు. కానీ జీవితం మీద ఆశ, శక్తి గొప్పది. గతంలో నేను జయించిన శిఖరాలు నన్ను మరింత ముందుకు నడుపుతున్నాయి’ అంటూ ఎమోషనల్ అయింది మమతా మోహన్ దాస్. ప్రస్తుతం ఆమె తెలుగు, మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.

విటిలిగో అంటే..

ఈ సమస్య వల్ల శరీరం రంగు మారుతుంది. చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. సమయం గడిచే కొద్ది ఆ మచ్చల పరిమాణం పెద్దదిగా అవుతుంటుంది. దీన్నే అచ్చ తెలుగులో బొల్లి వ్యాధి అని పిలుస్తారు. ఈ పరిస్థితి ప్రాణాపాయం కాదు, అంటు వ్యాధి కాదు. ప్రపంచవ్యాప్తంగా 1 శాతం మంది వ్యక్తులు బుల్లిని కలిగి ఉంటారు. ఇది సాధారణంగా చేతులు, కాళ్లు, ముఖంను ప్రభావితం చేస్తుంది.