గోమాంసాన్ని తీసుకెళ్తున్నాడని పోలీసుల ముందే ఘోరంగా దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

గోమాంసాన్ని తీసుకెళ్తున్నాడని పోలీసుల ముందే ఘోరంగా దాడి 

August 1, 2020

Man Accused Of Carrying Beef Gurgaon cow vigilantes

ఉత్తరభారతంలో కొన్నాళ్లుగా ఆగిపోయిన గోరక్షకులు దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఆవు మాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో ఓ ట్రక్కు డ్రైవర్‌పై కొందరు తీవ్రంగా దాడి చేశారు. పోలీసుల కళ్ల ముందే అత్యంత అమానుషంగా కొట్టారు. దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని గుర్గావ్‌లో శుక్రవారం ఈ దారుణం జరిగింది. 

మాంసం ట్రక్కు నడుపుతున్న లక్మన్ అనే వ్యక్తిని కొందరు అటకాయించి దాడి చేశారు. అది గోమాంసం కాదని చెబుతున్నా వినకుండా సుత్తితో తీవ్రంగా కొట్టారు. పోలీసులు ముందే అతణ్ని లాక్కెళ్లి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు అతణ్ని కాపాడాల్సింది పోయిన ట్రక్కులో ఉన్నది గోమాంసమో కాదే తేల్చుకోడానికి శాంపిళ్లను లేబొరేటరీకి పంపారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక నిందితుణ్ని అరెస్ట్ చేశారు. అయితే ట్రక్కులో ఉన్నది గేదె మాంసమని, 50 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నామని దాని యజమానులు చెబుతున్నారు.