సోషల్ మీడియా అని, మనం ఏం కామెంట్ చేసినా ఎవరూ పట్టించుకోరు… ఎవర్నైనా అనొచ్చు అనుకుంటున్నారు కొందరు. పచ్చిగా కామెంట్లు చేస్తున్నారు. కానీ ఏదీ ఎక్కువ రోజులు సాగదు అనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది.పరువుహత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతను కించపరుస్తూ అసభ్యంగా దూషించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమృతను ట్రోల్ చేస్తూ ఈశ్వర్ (25)అనే వ్యక్తి చాలా అసభ్యకరంగా ఫేసుబుక్లో పోస్టులు పెడుతూ కామెంట్లు చేశాడు. దీంతో ఆమృత తనపై సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు ఈశ్వర్ అనే వ్యక్తి తన ఫేసుబుక్ ద్వారా పోస్టులు పెడుతున్నట్టు గుర్తించి, అరెస్ట్ చేశారు.ప్రణయ్ హత్య కేసులో అమృతను దూషిస్తూ…ఆమె తండ్రి మారుతీరావును అభినందిస్తూ సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కామెంట్స్ చేసేవారికి వార్నింగ్ ఇచ్చేలా పోలీసులు ఈ వ్యవహారంలో తొలి అరెస్ట్ చేశారు.