చేయి ఊపుతూ, కేకలేస్తూ.. విమానాన్ని ఆపబోయాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

చేయి ఊపుతూ, కేకలేస్తూ.. విమానాన్ని ఆపబోయాడు..

September 28, 2018

ఆపండి బాబూ అని అరుస్తూ ఎవరైనా చేయి ఊపుతూ కనిపిస్తే బస్సులను ఆపేస్తారు డ్రైవర్లు. అలా కేకలేస్తూ చేయి ఊపితే విమానాన్ని కూడా ఆపేస్తారనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అనుకోవడంతో సరిపెట్టుకుకోకుడా ప్రయోగం కూడా చేసి పడేశాడు. కదులుతున్న విమానాన్ని ఆపాలంటూ సెక్యూరిటీని నెట్టేసి మరీ రన్‌వేపై పరుగులెట్టి నానా రచ్చా చేశాడు. చివరకు జైలుపాలయ్యాడు.Man arrested for chasing after plane at Dublin Airportఈ  ఉదంతం ఐర్లండ్‌లోని డబ్లిన్ విమానాశ్రయంలో జరిగింది. ఓ విమానం డబ్లిన్ నుంచి ఆమ్‌స్టర్‌డ్యాం వెళ్లడానికి టేకాఫ్ తీసుకుంది. ఇంతలో పాట్రిక్ కెహోయ్ (23) అనే యువకుడు ఓ మహిళతో కలసి ఎయిర్‌పోర్ట్‌కు చివరి నిమిషంలో చేరుకున్నారు. అయితే అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది గేటును వేశారు. అంతేకాకుండా  విమానం రన్ వేపై కదులుతోంది. విమానం వెళ్లడాన్ని చూసిన పాట్రిక్, మరో మహిళ.. అక్కడి సెక్యూరిటీ తలుపును బలంగా తన్నేసి మరీ రన్ వేపైకి పరుగులు పెట్టారు. విమానాన్ని ఆపాలంటూ గట్టిగా కేకలు వేశారు. ఇదెక్కడి చోద్యమని ఆశ్చర్యపోయిన పోలీసులు వారిద్దర్నీ వెంటపడి పట్టుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు పాట్రిక్‌ను అరెస్ట్ చేశారు.