Man arrived in Mercedes to get 'subsidised wheat' at Rs 2 kg in Hoshiarpur, inquiry ordered
mictv telugu

గోధుమల కోసం మెర్సిడెజ్ బెంజ్‌ కారులో రేషన్ షాప్‌కు.. వీడియో వైరల్

September 6, 2022

ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆసరాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాయి. అయితే చాలావరకూ ఈ బియ్యం దుర్వినియోగమవుతున్నాయన్న విషయం తక్కువ మందికే తెలుసు. పలు రాష్ట్రాల్లో ఉచిత బియ్యం, గోధుమలు తీసుకుంటున్న లబ్ధిదారులు.. వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఒక కిలో బియ్యాన్ని రూ.10 చొప్పున అమ్ముతుండగా.. కొనుగోలు చేసిన వారు వాటిని పాలిష్ చేసి సన్నరకం బియ్యంగా మార్కెట్‌లో తిరిగి అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా…. బెంజ్‌ కారులో వచ్చిన ఓ వ్యక్తి రేషన్‌ సరుకులను తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌ లోని హోషియార్‌పూర్‌లో ఓ వ్యక్తి ఉచిత రేషన్‌ను తీసుకోవడానికి బెంజ్‌ కారులో వచ్చాడు. పంజాబ్‌ ప్రభుత్వం ఇచ్చే గోధుమలను బెంజ్‌ కారులో తీసుకెళ్లాడు. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. అయితే రేషన్‌ షాప్‌కు వచ్చిన ఆ వ్యక్తి తరువాత వివరణ ఇచ్చాడు. తన పేరు సుమిత్‌ షైనీగా చెప్పుకుంటూ.. ఆ కారు తనది కాదని , విదేశాల్లో ఉన్న బంధువులదని వెల్లడించారు. రేషన్‌ దుకాణంలో క్యూలైన్‌లో ఉన్న తన పిల్లలు రేషన్‌ను తీసుకెళ్లడానికి రావాలని కోరడంతో ఆ కారును తీసుకొచ్చినట్టు తెలిపారు. డీజిల్‌ కారు కావడంతో అప్పుడప్పుడు స్టార్ట్‌ చేయాలని , అందుకే రేషన్‌ షాప్‌కు కారును తీసుకొచ్చినట్టు తెలిపారు. తన పేదవాడినే అని , తన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారని , కావాలంటనే దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు.