రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతితో సహ 12మందిపై కత్తితో దాడి - MicTv.in - Telugu News
mictv telugu

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతితో సహ 12మందిపై కత్తితో దాడి

October 24, 2022

Man Attack On Young Woman Family In Phirangipuram Guntur District

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతి వెంటపడ్డాడు. పెద్దలు మందలించినా వినలేదు.. ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం జరిగినా వదల్లేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో.. ఆమె కుటుంబంపై యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేయడం కలకలంరేపింది.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం అనే గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు గత కొద్ది నెలలుగా ప్రేమ పేరుతో బాధితురాలి వెంటపడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు అతన్ని హెచ్చరించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఇటీవల యువతికి నిశ్చితార్థం జరిగింది. అయినప్పటికీ.. ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధిస్తున్నాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు.. కుల పెద్దలలో పంచాయితీ పెట్టించారు. ఈ పంచాయతీకి ఇరు వర్గాలు సైతం వచ్చారు. అయితే అప్పటికే యువతికి నిశ్చితార్థం జరగడంతో మణికంఠ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ సమయంలో యువతి ప్రేమని నిరాకరించడం, కుటుంబసభ్యులు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో మణికంఠ ఆగ్రహంతో రగిలిపోయాడు. పెద్దల సమక్షంలో యువతి, బాధితురాలి కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తులు, రాడ్లతో దాడి చేశాడు.

మణికంఠ దాడిలో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలి తలకు తీవ్ర గాయం కావడంతో జీజీహెచ్‌లో చికిత్సనందిస్తున్నారు. మరో 9మంది నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. బాధితురాలితోపాటు.. మరో ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భయంతో పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.