Man builds temple for UP CM Yogi Adityanath, prays to his life-size idol
mictv telugu

రాముని అవతారంలో సీఎంకు గుడి కట్టి పూజలు

September 19, 2022

Man builds temple for UP CM Yogi Adityanath, prays to his life-size idol

బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో… అయోధ్య రామాలయం నిర్మిస్తున్నారని, శ్రీరామునికి అక్కడ అద్భుతమైన గుడి కడుతున్నారని మాత్రమే ఇప్పటి వరకూ తెలుసు. అయితే శ్రీరాముడి గుడి పూర్తి కాకముందే ఆ రాష్ట్ర సీఎంకు గుడి కట్టారు ఆయన అభిమానులు. రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడికట్టి రాముడిగా పూజిస్తున్న వార్త సంచలనం రేపుతోంది. ప్రభాకర్ మౌర్య అనే ఆధ్యాత్మిక గాయకుడు యోగి ఆదిత్యనాథ్ కు భక్తుడిగా మారిపోయారు. యోగి ఆదిత్యనాథ్ రాముడిగా గుడి కట్టించి.. ఇటీవలే ప్రారంభించారు

రామ బాణాన్ని ప్రయోగిస్తున్నట్లుగా విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందివ్వడంలో యోగి ఆదిత్య నాథ్ విజయం సాధించారని గ్రామీణప్రాంతంలో ఆ అభిమాని గుడికట్టేశాడు. ఆయోధ్య జిల్లా భరత్ కుండీ సమీపంలోని మౌర్యకా పూర్వ గ్రామంలో ఆదిత్యనాథ్ గుడి వెలసింది. గుడిలో ఆదిత్యనాథ్ నిలువెత్తు రూపంతో కాషాయ వస్త్రధారణతో చేతిలో బాణం పట్టుకున్నట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలన్నది తన కల అని, రాముడి గుడి ఎవరు కట్టిస్తే వారికి గుడి కట్టి పూజ చేస్తానని 2015లో శపథం చేశానని ప్రభాకర్ మౌర్య తెలిపారు. ఆ కలను నెరవేరుస్తున్న యోగి ఆదిత్యనాథ్ కూడా రాముడేనని పేర్కొన్నారు. ఈ ఆలయం కట్టడానికి సుమారు రూ.8.5 లక్షలు ఖర్చు అయిందని, రాజస్థాన్ లో విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చి ప్రతిష్టించానని చెప్పారు.