సోనూసుద్ ఫౌండేషన్ పేరుతో రూ.68 వేలు టోకరా - MicTv.in - Telugu News
mictv telugu

సోనూసుద్ ఫౌండేషన్ పేరుతో రూ.68 వేలు టోకరా

May 22, 2022

సోనూసూద్‌ ఫౌండేషన్‌ నుంచి మాట్లాడుతున్నానని, ఆపదలో ఉన్నవారికి ఆర్ధిక సాయం చేస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.68 వేలు కాజేశాడో గుర్తు తెలియని వ్యక్తి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. గుర్రంగూడలోని శ్రీనివాసపురం కాలనీకి చెందిన పి.సంధ్య(36) బంధువుల్లో ఒకరికి కేన్సర్‌ చికిత్స కోసం డబ్బు అవసరం పడింది. దీంతో ఆమె ట్విటర్‌లో సోనూసూద్‌ ఫౌండేషన్‌కు ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఈనెల 9న ‘07908197291’ నంబర్‌ నుంచి కాల్‌ చేసి, తాను సోనూసూద్‌ ఫౌండేషన్‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు.

పేషెంట్ వివరాలు అడిగినట్టుగా నమ్మించి, తన ఫోన్‌లో ‘ఎనీ డెస్క్‌ యాప్‌’ డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లి బ్యాంకు డెబిట్‌ కార్డును రెండు వైపులా స్కాన్‌ చేయమని చెప్పగా, ఆమె అలాగే చేసింది. త్వరలో తమ ఫౌండేషన్‌ నుంచి డబ్బు పంపిస్తామని, మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలని సూచించాడు. దాంతో ఆమె ఓటీపి చెప్పగానే ఆమె అకౌంట్‌ నుంచి మూడు దఫాలుగా రూ.68వేలు డ్రా చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన సంధ్య శనివారం మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.