నిద్రలో నడుస్తూ కరెంట్ స్తంభం ఎక్కాడు! - MicTv.in - Telugu News
mictv telugu

నిద్రలో నడుస్తూ కరెంట్ స్తంభం ఎక్కాడు!

February 3, 2020

Pole.

నిద్రలో నడిచే అలవాటు ఉందని సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజ జీవితంలో ఇలాంటి వారు అరుదు అనే చెప్పాలి. కానీ ఓ వ్యక్తి  మాత్రం నడవటమే కాదు ఏకంగా కరెంట్ స్తంభాలు కూడా ఎక్కేస్తున్నాడు. పైకి వెళ్లి అక్కడ ఎలాంటి ఆధారం లేకుండా హాయిగా ఫీట్లు చేశాడు. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. అతడి చేష్టలు చూసిన వారు నిజంగా అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉందా..? లేక మరేదైనా కారణమా అని ప్రశ్నించుకుంటున్నారు. 

నందినగర్​కాలనీలో ఓ యువకుడు రాత్రి సమయంలో విద్యుత్ స్తంభం వైపు నడుచుకుంటూ వచ్చాడు. దాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతడిని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి  కరెంట్ నిలిపివేయించాడు. ఆ యువకుడు మాత్రం అలాగే పైకి ఎక్కి ఫీట్లు చేశాడు. దీంతో ఏం జరుగుతుందోనని అక్కడున్న వారంతా ఆందోళన చెందాడు. వెంటనేే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

జనం గుమిగూడటంతో అతడు కొంత సేపటికి కిందకు దిగాడు. వెంటనే పోలీసులు అతన్ని ఎందుకు కరెంట్ స్తంభం ఎక్కావని ప్రశ్నించాడు. అయితే తాను నిద్ర మత్తలో ఎక్కాననీ, తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇది విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ యువకుడు చెప్పి మాటలపై అనుమానం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు కూడా అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉందని తెలియదని పేర్కొన్నారు. అతడు కావాలనే డ్రామాలు అడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.