Man climbs power supply tower in Kaushambi in protest of rising bill
mictv telugu

కరెంటు బిల్లు చూసి పిచ్చిపట్టింది, స్తంభం ఎక్కేశాడు..

July 18, 2022

మధ్యతరగతి ప్రజలు చాలా మంది కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని.. లైట్లు వేయకుండా, ఫ్యాన్లు నడపకుండా విద్యుత్‌ను ఆదా చేస్తుంటారు. అవసరం ఉన్నంత సేపు మాత్రమే విద్యుత్‌ను ఉపయోగించుకొని ఆ తర్వాత స్విచ్ఛాప్ చేసేస్తుంటారు. అయితే ఓ సాధారణమైన కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చింది. దాన్ని చూసి ఖంగుతిన్నాడు. దీంతో ఆ వ్యక్తి 40కే వోల్టు హైటెన్షన్ వైర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ ఏర్పడింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నందకాపూర్వ గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన అశోక్ కుమార్.. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. మూడేళ్ల కింద సౌభాగ్య పథకం ద్వారా అతనికి విద్యుత్ కెనక్షన్ వచ్చింది.అప్పటి నుంచి క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాడు. అయితే తాజాగా అతడికి 8 వేల 700 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది.దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. బిల్లు ఎందుకొచ్చిందో? ఆ బిల్లు ఎలా చెల్లించాలో తెలియక ఆ ఇంటి యజమాని అధికారుల చుట్టు తిరిగాడు. అయినా ఫలితం కనిపించలేదు. అయితే కరెంట్ బిల్లు కట్టలేదని విద్యుత్ అధికారులు అతని ఇంటికి పవర్ కనెక్షన్ తీసేశారు. దీంతో ఆగ్రహించిన ఇంటి యజమాని హైటెన్షన్ వైర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు.

మానసిక స్థితి సరిగా లేక… హై వోల్టేజీ విద్యుత్ టవర్ ను ఎక్కాడని అశోక్ భార్య మోహని దేవి తెలిపారు.అయితే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు విచ్చినప్పటి నుంచి తన భర్త తిండి తిప్పలు మానేసి, మతి స్థిమితం కోల్పోయినవాడిలా ప్రవర్తిస్తున్నాడని అతని భార్య తెలిపింది. పోలీసులు రాకపోయుంటే తన భర్త తనకు దక్కేవాడు కాదని కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి ఆ వ్యక్తి క్షేమంగా కిందికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.